జిల్లా కేంద్రంలోని మనోరమ ఆసుపత్రిలో డ్యూటీ లో ఉన్న నర్సు మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా డోంగ్లికి చెందిన శిల్ప నగరంలోని మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సు గా పని చేస్తున్నారని చెలిపారు.
ఈ మేరకు శిల్ప శుక్రవారం రాత్రి డ్యూటీకి వచ్చిందని తెలిపారు.నైట్ డ్యూటీలో జ్వరంతో బాధపడుతూ రాత్రి అదే ఆసుపత్రిలో సెలోన్ బాటిల్ పెట్టుకొని నైట్ నిద్ర పోయారు. తెల్లవారు జామున అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు చూసి నిద్ర లేపే ప్రయత్నం చేశారు.
అప్పటికే ఆమె శరీరం చల్ల బడి కదలికలు లేకపోవడంతో మృతి చెందినట్లు గుర్తించారని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఒకటవ టౌన్ పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
