జుక్కల్ మండలం పెద్ద గుల్ల తండాలో కూలర్ షాక్తో తల్లీకూతుళ్లు మృతి చెందారు.
స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సమ్కబాయి(34), కూతురు శివాని(14) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో కూలర్ విద్యుత్ సరఫరాలో లోపం తలెత్తి షాక్తో తల్లీకూతుళ్లు మృతిచెందినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
