దేశం ఎన్నోసార్లూ ఉగ్రదాడులకు గురి కాబడినది, ఇకను గురి అవుతూనే ఉంది, దానిని తిప్పికొట్టటానికి ఈ దేశానికి, సైనికులకు తెలంగాణ ఉద్యోగ JAC (TGEJAC) సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించింది.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా ఉద్యోగుల హక్కులు, రాయితీలు సాధనలో నిరంతర పోరాటం చేస్తూ వాటి సాధనలో ఎన్నో కష్ట, నష్టాలు వచ్చినా, వాటిని ఎదుర్కొని ఉద్యోగుల హక్కులను, రాయితీలను సాధించుకుంటున్నామనీ తెలిపారు.
ఈ ప్రభుత్వం ఏర్పాడిన గత 16 నెలలుగా ఉద్యోగుల హక్కుల సాధనకై ప్రభుత్వానికి సహకరిస్తూనే, ఆర్థిక పరిస్థితులను అర్ధం చేసుకొని సంయమనం పాటిస్తూ తప్పని సరి పరిస్థితిలలో ప్రభుత్వం పై ఎంత ఒత్తిడి చేసినా పెద్దగా స్పందన కనబడలేదు.
కావున సమస్యల సాధన కోసం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా 04-05-2025 నాడు జరిగిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) సమావేశ ఒత్తిడి మేరకు, ఎంతో కాలంగా ఎదురుచుస్తున్నా (57) ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పైన అధికారుల కమిటీని శ్రీ నవీన్ మిట్టల్, IAS, ప్రిన్సిపల్ కార్యదర్శి (రెవెన్యూ) ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పెండింగ్లో ఉన్న 10,000 వేల కోట్ల ఉద్యోగుల బిల్లులు వెంటనే విడుదల చేయాలి.(5) డీఏ లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అలగే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి (PRC) నివేదికను తెప్పించుకుని 51 శాతము ఫిట్ మెంట్ ను అమలుచేయాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ను అమలు చేయాలి.జి ఒ 317ని సమీక్షించి బాదితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరరి పోస్టులను కల్పించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్తానిక జిల్లా / జోన్ లకు కేటాయించాలనీ డిమాండ్ చేశారు.సాధారణ బదిలీలు-2025 ఏప్రిల్, మే నెలలోనే చేపట్టాలి, గత ఎలాక్షన్లో జరిగిన బదిలీలను వెంటనే వారి సొంత జిల్లాలకు పంపించాలనీ కోరారు.
