నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్ డి పి ఎస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిన్న రాత్రి ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు నిర్వహించిన తనిఖీల్లో వేల్పూరు గ్రామంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి యాళ్ల రిశ్వంత్ అదుపులోకి తీసుకొని 750 గ్రాముల గంజాయిని ఒక బైకును ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు
ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలో సోదాలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను ఒకటి షేక్ సమీర్ 2 షేక్ కలీం అనే వ్యక్తుల నుండి రెండు కిలోల 300 గ్రాముల గంజాయిని రెండు బైకులను రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది
మొత్తం మూడు కేసులు నమోదు చేసి ముగ్గురు వ్యక్తుల నుండి మూడు కిలోల 50 గ్రాముల గంజాయిని మూడు బైకులు మూడు సెల్ ఫోన్ లో స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు
ఈ దాడుల్లో సీఐ వెంకటేష్ ఎస్సై నరసింహ చారి సిబ్బంది భూమన్న గంగారం విష్ణు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మరో మారు ఎక్సైజ్ శాఖ వారు హెచ్చరించారు.
