HomeTelanganaNizamabadబక్రీద్ సందర్భంగా ముస్లింలకు పోలీసు భద్రత కల్పించాలి.

బక్రీద్ సందర్భంగా ముస్లింలకు పోలీసు భద్రత కల్పించాలి.

ఈద్-ఉల్-అజ్హా (బక్రీద్) పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు ముస్లింలకు పోలీసు పికెట్లు, ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని AIMIM పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ అహ్మద్ సీపీ ని కోరారు.

ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆయన సోమవారం వినతిపత్రం సమర్పించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల బలి కోసం సాటాపూర్ బజార్,నవీపేట్,ఇచోడ, ఆదిలాబాద్, పిట్లం మరియు బాన్స్వాడ నుంచి ఆర్మూర్ రోడ్, హైదరాబాద్ రోడ్,డిచిపల్లి , మోస్రా, బాన్స్వాడ సాటాపూర్,బోధన్ రోడ్ మీదుగా ఈ రూట్ లలో వారికీ రక్షణ కావాలని కోరారు. పై రూట్ల నుంచి మూకిళ్ళను కొనుగోలు చేసి వెళ్ళ్లే క్రమంలో మధ్య మార్గం లో గో రక్షకులుగా భావించే కొంతమంది బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ సభ్యులు మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా వాహనాల్ని అపి వాటిని గోశాలకు పంపిస్తున్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్, సిగ్నేచర్ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ద్వేష ప్రసారాలు చేస్తూ, మత కలహాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈయన గో రక్షకులతో కలిసి కాటిల్ వాహనాల్ని ఆపేస్తూ, వేటర్నరీ సర్టిఫికెట్లు ఉన్నా పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్‌లకు లేదా గోషాలాలకు తరలిస్తున్నారని షకీల్ పేర్కొన్నారు.

పోలీసుల సహకారం కోరారు:
ప్రతి సంవత్సరం ముస్లింలు శాంతియుతంగా పండుగ జరుపుకుంటున్నారని, ఈసారి కూడా అదే విధంగా జరుపుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని AIMIM నేత వివరించారు. మద్యపానము చేసిన గో రక్షకులు వాహనాలపై దాడులు చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ అవసరం:
మరొక ముఖ్యమైన అంశంగా, జంతువుల సరఫరాకు సంబంధించి ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్:
సదరు జర్నలిస్ట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని, అతని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మార్గంగా చట్టవిరుద్ధంగా విద్వేషాలను వ్యాపింపజేస్తున్నాడని ఆరోపించారు. ఆయనే ఎక్కడి నుంచి జంతువులు కొనుగోలు చేస్తున్నారో గుర్తించి ట్రాకింగ్ చేస్తున్నాడని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments