క్షుద్ర పూజల నెపంతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులకు అడిషనల్ జడ్జి రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం క్షుద్ర పూజలు చేసి కొడుకు మృతికి కారణమయ్యారని సిద్ధాపూర్ తండాకి చెందిన దౌలత్ రావు, సరి చంద్,శంకర్ ముగ్గురు కలిసి మాణిక్ చంద్, పద్మా అనే వారిని సర్పంచి పిలుస్తున్నారని చెప్పి పిలిచి వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టినట్లు 2017 జూలై 10 వ తేదీన వర్ని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.అప్పటి వర్ని ఎస్ఐ అంజయ్య కేసు నమోదుచేసి,నేరపరిశోధన చేసి కోర్ట్ నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా కేసు ను విచారించిన అడిషనల్ జడ్జి ఈ.సాయి శివ వారికి రెండు సంవత్సరాల కఠిన కారాగర శిక్ష విధించినట్లు తెలిపారు.టెక్నాలజీ అభివృద్ధి అయిన ఈ కాలంలో కూడా ఇలాంటి దారుణాలు జరగడం విచారకరమని అన్నారు.అలాగే పోలీస్ శాఖ తండాలు ,గ్రామాలు అన్నిట్లో క్షుద్ర పూజలు అనేవి లేవు అని వాటిపై అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది.ఈ కేసులో బాధితుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసక్యూటర్ చిదరాల రాణి వినిపించారు.
