తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగింది. ఈ ఘటన ధర్పల్లీ మండలంలోని హొన్నాజిపేట లో జరిగింది.ధర్పల్లి ఎస్సై జాడి. రామకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం..
వేసవి కాలం వేడి ఎక్కువ అవ్వడంతో హోన్నజీపేట్గ్రామానికి చెందిన తొంటకోల్ల గంగారం దంపతులు ఇంటి స్లాబుపై పడుకున్నారనీ తెలిపారు. సోమవారం రాత్రి అది గమనించిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి చొరబడి సొత్తు కాజేశారని తెలిపారు.
తెల్లవారిజమున సుమారుగా 3:00 గంటలకు నిద్ర లేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి వున్నాయని, వెళ్లి చూసేసరికి బీరువా నుంచి 7 తులల బంగారం,12 తులాల వెండి,సుమారు రూ 3లక్షల నగదు అపహరించినట్లు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించినట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ తెలిపారు.
