మద్యం సేవించి వాహనాలు నడిపిన 5 గురికి జైలు శిక్ష, 16 మందికి జరిమాన విధించినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 21 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించినట్లు తెలిపారు.
మంగళవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహన్ బేగం జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
టౌన్-1 పి.యస్ పరిధిలోని బంటు చిన్నకు, టౌన్-5 పి.యస్ పరిధిలోని ఉల్లెంగాల సాయిలుకీ, నవీపేట్ పి.యస్ పరిధిలోని భూమింగ్ అంకేష్ కి,అలాగే మాక్లూర్ పి.యస్ పరిధిలోని డబ్బాగుట్ట మలయాద్రికి 2 రోజులు జైలు శిక్ష విధించింది.
అలాగే ముగ్పాల్ పి.యస్ పరిధిలోని మునిపల్లి సాయిలు కు 3 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
