వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. బస్సులో ఉన్న వారిలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన పెళ్లి వారి బస్సు పరిగి లో విందు ముగించుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్న క్రమంలో రంగాపూర్ గ్రేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి మల్లేష్ (35). షాబాద్ మండలం సోలిపేట్ గ్రామానికి చెందిన బాలమ్మ (60). చేవెళ్ల మండలం రావులపల్లి గ్రామానికి చెందిన హేమలత (32).ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ కు చెందిన సందీప్ (28). అను నలుగురు వ్యక్తులు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
