నందిపేట మండల కేంద్ర బస్టాండ్ వెనకాల గల బస్ డిపో నిర్మానుష్య ప్రాంతం లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల ఘర్షణలో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలై రక్తం మడుగులో కొనఊపిరితో ములుగుతున్న వ్యక్తిని అటుగా వెళుతున్న స్థానికులు గమనించి దగ్గరికి వెళ్లారు.
తలకు గొంతు దగ్గర తీవ్ర గాయలవడంతో అతనిని వెంటనే 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవ గల కారణాలు తెలుసుకుంటున్నారు.
గాయపడ్డ వ్యక్తి డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన రమేష్ గా పోలీసుల అనుమానిస్తున్నారు అతని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.
రాత్రి సమయంలో గొడవ జరిగి ఉండొచ్చని, తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించామని, అలాగే 108 లో ఆసుపత్రికి తరలించడం జరిగిందని ప్రత్యక్ష సాక్షి మచ్చర్ల చిన్న సాయిలు తెలిపారు.
