అనారోగ్యంతో బాధపడుతూ ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన దోమల చంద్రకళ(55).గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతూ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
