విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులకు మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హమ్మయ్య (41), రాములు (44) పొలంలో మోటర్ వద్ద పైపులు సరిచేస్తుండగా విద్యుత్ తీగ పైపులకు తగిలి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది.
దీంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
