HomeEditorial Specialగులాబీ శిబిరం లో అంతా గప్ చుప్ ........కవిత ఎపిసోడ్ పెదవి దాటని మాట ........సైలెంట్...

గులాబీ శిబిరం లో అంతా గప్ చుప్ ……..కవిత ఎపిసోడ్ పెదవి దాటని మాట ……..సైలెంట్ మోడ్ లో మాజీలు ………

ఎమ్మెల్సీ కవిత అధినేత కెసిఆర్ వైఖరి మీద ధిక్కార స్వరం ఎత్తిన నేపథ్యంలో గులాబీ పార్టీ లో ఒక్కసారి గా నిశ్శబ్దం ఆవరించింది. కవిత ముందు వీరవిధేయులుగా చెలామణి అవుతూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు.

ఈ వ్యవహారంలో తలదూర్చిద్దంటూ ఇప్పటికె కేటీఆర్ సన్నిహితుల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీనితో మాటలు పెదవి దాటకుండ గులాబీ నేతలు తమకు తాముగా కట్టడి చేసుకుంటున్నారు.

కానీ ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఎటు వైపు వెళ్తాయనేది మాత్రం అరా తీసే పనిలో ఉన్నారు. ఎలాగో వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విదేశాలకు వెళ్లారు ఇప్పట్లో పార్టీ కార్యకలాపాలు ఉండే ఛాన్స్ లేదు.

సో అప్పటిదాకా నియోజకవర్గాలకు దూరంగా ఉండే యోచనలో మాజీ ఎమ్మెల్యే లున్నారు. పార్టీ లో కవిత ఎపిసోడ్ పిక్ స్టేజ్ లో ఉన్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వస్తే ఏదోకటి నోరు జారే ప్రమాదం ఉందని వారు జంకు తున్నారు అందుకే అప్పటిదాకా నియోజకవర్గాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు.

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ పరంగా ఘనంగా చేయాలని అధినేత చెప్పారు. నియోజకవర్గాల్లో మమా అనిపించాలని భావిస్తున్నారు. కానీ తమ నియోజకవర్గాల్లో ఎవరెవరికి కవిత నుంచి పిలుపు వస్తుందనేది ఎప్పటికప్పుడు అరా తీస్తున్నారు.

కవిత ఎపిసోడ్ ఒకటి రెండు రోజుల్లో క్లోజ్ అవుతుందని తేలిక తీసుకున్నారు. కానీ రోజు రోజుకి క్లిష్టంగా మారడం తో గులాబీ వర్గాలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె వెంట జిల్లానుంచి ఎవరెవరువెళ్తారనేది అధిష్టానం వద్ద ఇప్పటికే ఓ నివేదిక ఉంది. అందుకే నేతల్లో కవిత తాలూకు టెన్షన్ పెద్దగా కనిపించడం లేదు.

ఎంపీ గా ఓడిపోయాక ఆమె జిల్లా నేతలకు అందుబాటు లో లేకుండా పోయారు. జిల్లా లోకల్ బాడీ కోట లో ఎమ్మెల్సీ గా రెండు సార్లు గెలిచినా ఏనాడూ లోకల్ బాడీ సమావేశాలకు హాజరు కాలేదు. లిక్కర్ కేసు నుంచి బయటికి వచ్చాక జిల్లా వ్యవహారాలకు మరింత దూరం అయ్యారు.

మొదట జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే లకు ప్రత్యామ్నాయంగా బలమైన నెట్ వర్క్ ఆమె కు వుండే కానీ జైల్ నుంచి వచ్చాక సమీకరణాలు మారాయి. బలమైన నేతలెవ్వరూ ఆమె వెంట లేకుండా పోయారు.మాజీ ఎమ్మెల్యే లను కాదని ముఖ్య నేతలు సైతం కవిత వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. అదే కవిత లో ధిక్కార స్వరం ఎత్తేలా చేసింది.

ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఎటు వైపు పడుతాయనేది గులాబీ వర్గాలకు ఆసక్తిగా మారింది.కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే యత్నాల్లో ఉన్నారని ? లేదు కొత్త రాజకీయ వేదిక ను తెరమీదికి తేబోతున్నారని ……ఎహే ఇలాగే మరింత బెట్టు చేసి పార్టీలో ప్రాబల్యం పెంచుకునే ఎత్తుగడ లో ఉన్నారని ……ఆమె పార్టీ వీడే ప్రస్తక్తే లేదని పార్టీలో ఇదో టీ కప్ లో తుపాన్ లాంటిదనే ధీమాతో మరి కొంత మంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments