HomeTelanganaNizamabadనేను అసలే మంచి దాన్ని కాదు.. నేను నోరు విప్పితే తట్టుకోలేరు....చిట్ చాట్ లో నిప్పులు...

నేను అసలే మంచి దాన్ని కాదు.. నేను నోరు విప్పితే తట్టుకోలేరు….చిట్ చాట్ లో నిప్పులు చెరిగిన కవిత …….ఈసారి టార్గెట్ కేటీఆర్ …..బీఆర్ఎస్ లో‌ మరింత ముదిరిన ముసలం

నేను అసలే మంచి దాన్ని కాదు.. నేను నోరు విప్పితే తట్టుకోలేరని ఎమ్మెల్సీ కవిత మరో బాంబ్ పేల్చారు. ఆమె గురువారం తన ఇంట్లో మీడియా తో చిట్ చాట్ చేశారు.

ఈసారి బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ అన్న కేటీఆర్ ను టార్గెట్ చేశారు పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలుచేసారు దీనితో ఆ పార్టీ లో అగ్ర నేతల మధ్య ముసలం పరాకాష్ట కు చేరింది. ఆమె కాంగ్రెస్ లో చేరడానికి సంప్రదింపులు చేస్తున్నారని ఎమ్మెల్యే లతో వస్తే మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి లో వరుస కథనాల నేపథ్యంలో కవిత మీడియా ముందుకు వచ్చారు నాకు నీతులు చెప్తోన్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలన్నారు కేసీఆర్ నీడలో పని చేస్తోన్న వారు.నాపై ప్రతాపం చూపిస్తున్నారు.

దమ్ముంటే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన రేవంత్, బీజేపీపై ప్రతాపం చూపాలన్నారు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా..

ట్విట్టర్ లో మెసేజ్ లు సరిపోతాయా?అని ప్రశ్నించారు .నన్ను రేవంత్ రెడ్డి కోవర్టులు అనటం కరెక్టేనా? పెయిడ్ ఆర్టిస్ట్ లతో నాపై సోషియల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదన్నారు అయినా మానాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి? నీకు నొప్పి ఏంటిరా బయ్? అంటూ సైటైర్ వేశారు

నా డిమాండ్ ఒక్కటే నా లేఖ లీక్ చేసిందెవరు?నేను వాళ్ళలా చిచ్చోర రాజకీయాలు చేయను.హుందాగా ఉంటాను.నేను జైలుకు వెళ్లిన రోజుననే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పాను.పార్టీ వద్దని చెప్పింది.చేయను.దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏంటీ లాభం?నా పై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదు.

ఇంటి ఆడ బిడ్డ పై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా.ఢిల్లీ లో ఉన్నప్పుడే నా పై కుట్రలు మొదలయ్యాయి.లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరుడు దండెత్తాడు..బి.ఆర్. ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు.ఇంకెవరి నాయకత్వం నేను అంగీకరించను.

కాంగ్రెస్ మునిగిపోయే నావ.నాది బి.ఆర్.ఎస్ పార్టీ.కాంగ్రెస్ పార్టీతో రాయబారాలు నాకెందుకు.బీజేపీ పార్టీ వాళ్ళు కట్టిన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన వారు పార్టీలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments