ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విష యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ క మిషనరేట్ పరిధిలో 42 సంవత్సరాల పాటు సర్వీసు పూర్తి చేసుకునీ సి.సి.ఆర్.బిలో ఎస్.ఐ,గా విధులు నిర్వహిస్తున్న జీ.చందయ్య, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎమ్. సత్యం,అలాగే మెండోరా పోలీస్ స్టేషన్ లో పి.సి 612,సాబేర్ హుస్సేన్, l ఎ.ఎస్.ఐ, మెర్తాడ్ పోలీస్ స్టేషన్ పి. శ్రీనివాసులు,శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పదవి విరమణ సందర్భంగా శాలువాలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికెట్లు ఘనంగా సత్కరించడం జరిగింది.
పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) శ్రీ బస్వారెడ్డి , ఏవో ఆసియా బేగం, సి.సి.ఆర్.బి, సి.ఐ శ్రీ.సతీష్ కుమార్ , డిచ్పల్లి సి.ఐ శ్రీ మల్లేష్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీ తిరుపతి (వెల్ఫేర్) తదితరులు పాల్గొన్నారు.
