కొడుకు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ ఓ తండ్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు .
భీమ్గల్ మండలం రూప్ల తండాకు చెందిన బీను, కు అతని కొడుకు మధ్య ఇంటి నిర్మాణం విషయంలో శనివారం వివాదం తలెత్తింది. ఈ పంచాయితీ భీమ్గల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. కొడుకు పిర్యాదు మేరకు బీనును ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు తీవ్రంగా కొట్టారు.
దీనితో బాధితుడు ఆదివారం నిజామాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చి బైఠాయించారు. అక్కడే ఉన్న స్పెషల్ బ్రాంచి అధికారులు బాధితుడితో మాట్లాడాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు.
