1975లో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించి నేటికి 50 సంవత్సరాలు అయ్యిందని అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు.బుదవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని తుడిచిపెట్టారు. లక్షలాది మందిని జైల్లో పెట్టారన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. ఇవన్నీ ఒకే కుటుంబాన్ని అధికారంలో ఉంచడానికి మాత్రే చేశారు. తమ కుర్చీని కాపాడుకోవడానికి దేశాన్ని జైల్లో పెట్టిన వారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారనీ పేర్కొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు.దేశ చరిత్రలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ తో నియంతృత్వ పాలన సాగించారని ద్వజమెత్తారు.
రాజ్యాంగ విలువలను హత్య చేసి,మీడియా గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన సాగించారని ద్వజమెత్తారు.ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ దేశానికి మద్దతు తెలపాలని అంటున్నారని ఆగ్రహించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మనకు మిత్రదేశాలని,యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్ల కోసం ఇరాన్ కు మద్దతు ఇవ్వాలనడం సరికాదని అన్నారు.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చామని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు.
ఓ పక్క రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు రాక సతమతం అవుతున్నారని,రుణమాఫీ కాలేదని అధికారులే చెప్పిన పన్నించుకోకుండా సంబరాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అత్యవసర సమయంలో జిల్లాకు చేసిన పలువురు వ్యక్తులు జైలు పాలయ్యారని గుర్తుచేశారు.వారిలో పుప్పాల రాజేందర్,ఉల్స రాజేశ్వర్, గోవర్ధన్, శ్రీధర్ లకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
