జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆద్వర్యంలో శనివారం దివంగత జర్నలిస్టు విఠల్ వ్యాస్ ఐదవ వర్దంతి సందర్భంగా నిజామాబాదు రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ ,డాక్టర్ దన్ పాల్ వినయ్, డాక్టర్ సందీప్ రావ్ హాజరై మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు.
రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు..ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూమూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు..
రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు..
ఈ సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు.. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్ ,ఆర్ అండ్ బి విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ,రెడ్ క్రాస్ చైర్మెన్ బుస్స ఆంజనేయులు,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.రాజేష్,జేసిఐ అలుమ్ని వైస్ చైర్మెన్ జిల్కర్ విజయానంద్,నిజామాబాదు ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైర శేఖర్,టియూడబ్ల్యూజె ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అర్వింద్ బాలాజీ,టీయూడబ్ల్యూజె 143 సంఘం జిల్లా పూర్వాధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్, విఠల్ వ్యాస్మెమోరియల్ సొసైటీ కోశాధికారి, జమాల్పూర్, ఈశ్వర్,ఉపాద్యక్షులు డాక్టర్ కీర్తి,గోస్కెవార్ సాయిప్రసాద్,అడిశెర్ల మధుసూదన్,ఇంజమూరి మధు,సలహాదారులు ఏఎస్ సాంబయ్య,ఆశ నారాయణ,దయాకర్ గౌడ్,గోవిందరాజు,డాక్టర్ సందీప్, కార్యవర్గ సభ్యులు గౌతం,సంజీవ్, ఆనంద్ ,సందీప్ రాజా,రాహుల్,జర్నలిస్టులు కర్క రమేశ్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు
