HomeLaw and Orderకేంద్ర హోంశాఖ మంత్రి కి కేంద్ర బలగాలతో బందోబస్తు .....సీపీ వెల్లడి

కేంద్ర హోంశాఖ మంత్రి కి కేంద్ర బలగాలతో బందోబస్తు …..సీపీ వెల్లడి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం జిల్లా పర్యటన కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ సాయి ఛైతన్య చెప్పారు.

కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, లతో పాటు స్నైపర్ టీమ్స్,లను బందోబస్తుకోసం రంగంలోకి దించారు పటిష్టమైన నిఘా వ్యవస్థ, కోసం బైనాక్యూలర్ తో నిరంతరం పర్యవేక్షణచేసేలా ఏర్పాట్లు చేసారు.

కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటు రాష్ట్రంలోని ప్రత్యేక బలగాలయినటు వంటి 2 ఆక్టోపస్ టీమ్ లు, గ్రేహౌండ్స్ టీమ్లు, స్నైపర్ టీమ్స్ లతో పాటు, నిజామాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీలు టీమ్స్, బి.డి టీమ్స్, డాగ్ స్వ్కాడ్స్ లతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కల్వర్టులు రోడ్లు మొదలగు ప్రదేశాలలో సోదాలు చేసినట్లు ఆయన చెప్పారు .

గత వారం రోజుల నుండి అన్ని హోటల్స్, రెస్టారెంటులు, రిసార్ట్స్లను తనిఖీలు నిర్వహించి, ముఖ్యఅతిది పర్యటించే ప్రాతంలోని అన్ని చోట్ల ఇండ్లను తనిఖీలు నిర్వహించామన్నారు . అన్ని శాఖలతో సమన్వయం చేస్తు, 10 కి.మీ వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకోవడం జరిగిందని .

అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని . చుట్టు ప్రక్కల ప్రతీ ఇంట్లో ఎవ్వరిని కొత్తవారిని రానివ్వవద్దని తెలియజేయడం జరిగింది.

అనుమానస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే డయల్ 100 లేదా మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు బందోబస్త్ కోసం అదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్ ,సిద్దిపేట్, కామారెడ్డి, జిల్లాల నుండి అదనపు బలగాలను దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు దారి పోడువున ” సి.సి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు, సైతం ఏర్పాటు చేశామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments