తెలంగాణ బీజేపీ లో కొత్త అధ్యక్షుడి నియామకం తో అగ్ర నేతలమధ్య విబేధాలు తీవ్రం అయ్యాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజాసింగ్. కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ భారీ అనూచార గణంతో చేరుకున్నారు.
అయితే తన అనుచరులను బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేనని రాజీనామా చేస్తూ.. పార్టీకోసం తాను ఉగ్రవాదులకు శత్రువుగా మారానని, మీకో దండం, మీ పార్టీకి ఓ దండం అని రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.
