HomeLaw and Orderనైపుణ్య పెంపునకు పోలీస్‌ డ్యూటీ మీట్‌..నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు.

నైపుణ్య పెంపునకు పోలీస్‌ డ్యూటీ మీట్‌..నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు.

పోలీసు అధికారులు, సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేందుకు, పెంపొందించేందుకు జోనల్‌ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు.

పోలీస్ విధినిర్వహణలో సామర్ధ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా బుదవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటులో కార్యాలయంలో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ – 2025 కార్యాక్రమం ( నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలు) పోలీస్ డిపార్ట్మెంట్ లో పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సి.ఐ స్థాయి వరకు పనిపద్దతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయనీ, పనిలో పోటీతత్వం అలవాటుపడు తుందనీ అన్నారు.

సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్ , ఫారంసిక్ , ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా జిల్లాలో నేరాలు జరిగినప్పుడు అట్టి నేరస్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం “ పోలీస్ క్లూస్ ” ఏ విధంగా సేకరించాల అనేదాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ను ఇన్వెస్టిగేషన్ టూల్ గా మార్చుకోవడం కోసం తమను తాము మెరుగుపరుచుకుని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు.

ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ .ఆర్ ) రామ్ చందర్ రావ్, సి.సి.ఎస్. ఎ.సి.పి నాగవేంద్ర చారీ, జగిత్యాల్ , నిజామాబాద్ , నిర్మల్ , అదిలాబాద్ సి.ఐల ఎ,ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments