పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని పి డి ఎస్ యు PDSU ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యార్థులతో ఆర్మూర్ బస్టాండ్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డిఓకి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పి డి ఎస్ యు PDSU జిల్లా అధ్యక్షులు ఎం,నరేందర్. జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా గత ప్రభుత్వం మరియు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించకుండా వారికి రావాల్సినటువంటి బకాయిలను స్కాలర్షిప్, రియంబర్స్మెంట్, లను పెండింగ్ లో ఉంచాయని అన్నారు.
దాదాపు 7వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్ లో ఉంచి విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేడు హామీని మర్చిపోయారని, విద్యార్థుల పక్షాన ఆలోచించకుండా..
నేటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యాశాఖ ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంచుకొని విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోని వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్మిస్తామని ప్రతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ల ముందు వేలాది మంది విద్యార్థులతో నిరసనలతో కార్యక్రమాలు చేపడతామని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పిడిఎస్యు అధ్యక్షులు నిఖిల్, ప్రధాన కార్యదర్శి మమత, నాయకులు బాల కృష్ణ రాము, వివేక్ , విద్యార్థిని, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు
