భూ తగాదం హత్యాయత్నానికి దారి తీసింది.ఈ సంఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ అరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గొల్లగుట్ట కు చెందిన హైబాజ్ కు అదే ప్రాంతంలో తొమ్మిది ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు.
ఈ మేరకు ప్లాట్లలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రాము ఆ స్థలం నాది అని హైబాజ్ పై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో హైబాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అరీఫ్ తెలిపారు.
