జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని కంటేశ్వర్ ఆలయం వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ రథ యాత్రను ప్రారంభించారు.
జగన్నాథ దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు.ఈ ర్యాలీ రైల్వే కమన్, ఎన్టీఆర్ చౌరస్తా,రైల్వే స్టేషన్,బస్టాండ్,గాంధీచౌక్, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్, మీదుగా విజయలక్ష్మి గార్డెన్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా కళాకారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
