అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు సమాయత్తం అవుతుంది.సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షుడే రంగం లోకి దిగి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు శుక్రవారం యాల్బిస్టేడియం వేదికగా జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమావేశం స్థానిక ఎన్నికల నిర్వహణకు స్పష్టత ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది.
అధికారులుసైతంఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు.మరోవైపు బిఆర్ ఎస్ పార్టీ లో కనీస సందడి కనిపించడం లేదు . దీంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.రాజకీయంగాతమకు కలిసివచ్చే కీలకమైన ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ అధిష్ఠానం సానుకూలంగాలేకపోవడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ ఏఎంఎల్ లు కనీస ఆసక్తి చూపడం లేదు పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు నియోజకవర్గాల్లో తమ కనుసైగలతో పెత్తనం సాగించి తమకు తాముగా టైగర్ లుగా కీర్తనలు పొందిన మాజీలు ఇప్పుడు పార్టీ అధికారం,కోల్పోవడంతో అడ్రస్ లేకుండా పోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గాలకు మొఖం చాటేశారు కనీసం ముఖ్య కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు పార్టీవర్గాలు బలంగా వినిపిస్తున్నాయి.
పదేళ్ళుఅధికారంఅండతో యదేచ్ఛగా వ్యవహరించిన మాజీ లు ఇప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయాక ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయనే భయంతో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు పార్టీ అధిష్టానం ఎలాగో నియోజకవర్గాల ఇంచార్జి లను మార్చే పరిస్థితుల్లో లేదు అదే మాజీలకు అలుసుగా మారింది ఏడాదిన్నర కాలంగా పార్టీ శ్రేణులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
గతంలో ఎం ఎల్ ఏ కోటరీ లో అడ్డగోలు దందాలు చేసిన ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు పార్టీ కి చెందిన ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ లు పదవి కోల్పోవడంతో గ్రామాల్లో పార్టీకి కీలక వ్యక్తులు అందుబాటులో లేకుండా పోయారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతుంది.అధికార పార్టీ నేతలు ఆయా నియాజకవర్గాల్లో దూకుడు పెంచారు. పార్టీకి ఏళ్ల తరబడి గా పనిచేస్తున్న గులాబీ శ్రేణులు మాత్రం దిక్కులు చూస్తున్నారు.
పార్టీ అధిష్ఠానం లో ఇంకా ఉలుకుపలుకు లేకుండా ఉంది మాజీ ఎమ్మెల్యే లు తమ వైపు కన్నెత్తి కూడా చూడక పోవడంతో లోకల్ బారి దిగాలా ?వద్దా ? అనే సంశయం లో గులాబీ శ్రేణులున్నాయి. నిజానికి ఈ ఎన్నికలను తమ ప్రతి సవాల్ గా తీసుకుంటుందని గులాబీ శ్రేణులు భావించాయి. కానీ అధికార పార్టీ మాత్రం లోకల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది.
ప్రజల్లో ప్రభుత్వ పనితీరు కు ఈ ఎన్నికలు గీటు రాయి గా కాబోతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో పార్టీ సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది.
కానీ గులాబీ పార్టీ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధిస్తే అధికార పార్టీ కచ్చితంగా ఇరుకున పడే అవకాశం ఉంది. కానీ ఆ దిశ గా గులాబీ పార్టీ కార్యచరణ తో కార్యక్షేత్రంలోకి దిగలేక పోతుంది
