నగరంలో వైశ్య భవన్ కమిటీ ఎన్నికలు రేగెత్తిస్తున్న వేడినగరం వ్యాప్తంగా వైశ్య భవన్ కమిటీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి.
సుదీర్ఘ చరిత్ర గల ఈ కమిటీకి ఈసారి జరుగుతున్న ఎన్నికలు మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.గత 25 ఏళ్ల క్రితం వరకు నగరంలోని ప్రసిద్ధి గాంచిన టెంపుల్ మరియు వైశ్య భవన్ కమిటీ ఒక్కటేగా ఉన్నవి.
అయితే ఆలయం ఎండోమెంట్ విభాగం పరిధిలోకి వెళ్లిపోవచ్చన్న ఆందోళనతో, సమాజ పెద్దలు వైశ్య భవన్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది.వైశ్య సమాజ చరిత్రలో ఈ భవన్ కు ప్రత్యేక స్థానం ఉంది.
నగరంలో కల్యాణమందిరాల పునాదిని వేస్తూ తొలిసారిగా ఏర్పాటు చేయబడిన కల్యాణమండపం ఇదే. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 100 ఏళ్లుగా నిరంతర వినాయక పూజలు జరుపుతూ కొనసాగుతున్న ఏకైక వినాయక మండపం కూడా ఇదే భవన్ పరిధిలోనే ఉంది.
ఇలాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న కమిటీ కోసం ఈసారి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు గట్టి పోటీలో నిలిచారు.ఇల్లందుల సుధాకర్, ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
స్థానిక స్థాయిలో బలమైన మద్దతు కలిగి ఉండటం అతనికి మరో ప్లస్ పాయింట్.మరోవైపు విశ్వనాథ్ నారాయణ గుప్త, 30 ఏళ్లు పైగా పలు సేవా సంస్థలకు నాయకత్వం వహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్ఐసీ ఏజెంట్‌గా పెద్దలు, చిన్నవారందరికీ సుపరిచితుడే.
ఇద్దరు అభ్యర్థులు కూడా వైశ్య భవన్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని హామీ ఇస్తూ, పద్ధతిగా ప్రచారం సాగిస్తున్నారు. సభ్యుల మద్దతు కోసం వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ప్రచార యుద్ధం నడుస్తోంది.
రేపు జరగబోయే పోలింగ్ ఫలితాలు ఎటువైపు తారుమారు అవుతాయో చూడాలి. ఎవరు గెలిచినా, వైశ్య భవన్ అభివృద్ధే లక్ష్యమని రెండువైపులకీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
