Monday, May 4, 2026
HomeTelanganaNizamabadమానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..

పక్షవాతం జబ్బుతో మోటార్ సైకిల్ పై నుండి పడిన వ్యక్తిని ట్రఫిక్ కానిస్టేబుల్ సంజీవ్ కాపాడి మానవత్వం చాటుకున్నారు.

శనివారం మధ్యాహ్నం 1200 గంటలకు కాంటేశ్వర్ బైపాస్ సర్కిల్ వద్ద ఒక వ్యక్తి బీపీ తక్కువై మరియు పక్షవాతం వచ్చి రోడ్ పై పడి గాయాలయ్యాయి.

దీంతో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంజీవ్ వెంటనే స్పందించి అతనికి సపర్యలు చేసి అందుబాటులో గల ఆర్ఎంపీ డాక్టర్ తో ప్రాథమిక వైద్యం చేయించి ఆర్ఎంపీ డాక్టర్ గారి సూచనతో అంబులెన్సు పిలిపించి హాస్పిటల్ పంపించారు.

దీంతో స్థానికులు, విషయం తెలుసుకున్న ఏసీపీ మస్తాన్ అలీ మరియు ట్రాఫిక్ PS ఎస్ ఎచ్ వో ప్రసాద్ లు అతన్ని అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!