నగరంలోని ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీగా మారాయి. కాసేపట్లో పోలింగ్ పక్రియ మొదలు కాబోతుంది. ప్రచార పర్వం రాజకీయ రచ్చ గా మారింది. ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి.
పదేళ్లు తిరుగులేని పెత్తనం సాగించిన బిఆర్ యస్ ఈసారి దిక్కులు చూస్తుంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. కులంలో తమ పట్టు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఎన్నికల బరిలోకి దిగిన వారంతా విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖరీదైన విందులు జరిగాయి. పట్టణ ఆర్యవైశ్య సంఘం తో పాటు అయిదు అనుబంధ సంఘాల్లో ఇప్పటికే రెండు సంఘాలకు అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిగిలిన నాలుగు సంఘాలకు పోటీ కొనసాగుతోంది.ఏకగ్రీవంగా ఎన్నికైన వారు:ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా మా శెట్టి లిఖిత్ కుమార్శ్రీశ్రీశ్రీ నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా చిన్ని వివేకానంద గుప్త ఎన్నికయ్యారు.మిగిలిన నాలుగు సంఘాలకు మాత్రం ఎన్నికలు జరగనున్నాయి.
సంఘానికి చెందిన 10,017 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పోటీలో ఉన్న అభ్యర్థులు:
# ఇందూర్ పట్టణం ఆర్యవైశ్య సంఘం
1)అర్వపల్లి పురుషోత్తం,
2) ధన్పాల్ శ్రీనివాస్,
# శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ
1) పాలి రవికుమార్,
2)బాశెట్టి విశ్వనాథ్,
#. వైశ్య భవన్ కమిట#
1) ఇల్లెందుల సుధాకర్
2) విశ్వనాథ్ నారాయణ
## నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ – వైశ్య జూనియర్ కళాశాల కమిటీ##
1) ఇంగు శివప్రసాద్,
2) గజవాడ హనుమంతురావు ఆదివారం . పోలింగ్ అనంతరం, తదుపరి రోజు సోమవారం కౌంటింగ్ నిర్వహించనున్నారు..
