రెండు సంవత్సరాల బాలుడు ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు రెండు రూపాయల కాయిన్ మింగిన సంఘటన లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, లింగంపేట్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో బందెల రాజు సంతోషిని దంపతుల కుమారుడు బందెల తన్వీర్ (2 ) ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో రెండు రూపాయల కాయిన్ ప్రమాదవశాత్తు మింగేసాడని తెలిపారు.
కైన్ మింగిన బాలుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో, మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, బాలుడికి పరీక్షలు నిర్వహించి ఎక్స్రే తీయగా గొంతులో రెండు రూపాయల కాయిన్ ఉన్నట్లు గుర్తించారు.
వైద్యుడు సూచన మేరకు కామారెడ్డి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ బాలుడికి అత్యధిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి బాలుడి గొంతులో ఇరుక్కుపోయిన కైన్ ను సురక్షితంగా బయటికి తీశారు. గొంతులో ఇరుక్కున్న కైను సురక్షితంగా బయటికి తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
