రాష్ట్రంలో వ్యాపార సముదాయాల్లో పనిగంటలను ఎనిమిది గంటలనుండి 10 గంటలకు పెంచుతూ తీసుకొచ్చిన జీవో 282 రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికుల వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తుంటే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఆందోళనకు వెనక్కి తగ్గి 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి భయపడుతున్న సందర్భంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పనిగంటలను రోజుకు10 గంటలకు పెంచడం అంటే ఈ ప్రభుత్వం కూడా బిజెపి బాటలో నడుస్తుంది అనడానికి నిదర్శనం అన్నారు.
కార్మిక సంఘాలుగా జేఏసీ ని ఏర్పాటు చేసి పోరాడుతున్న జేఏసీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఘం ఉండి కూడా పని గంటలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన పనిచేస్తున్నామని ఇది ప్రజల ప్రభుత్వం అని ప్రగల్బాలు పలుకుతూ ఆచరణలో యాజమాన్యాలకి అనుకూలంగా చట్టాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
ఈ జీవోను రద్దు చేయకుంటే రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అనిల్ ఉపాధ్యక్షులు చక్రపాణి, భాగ్యలక్ష్మి, కవిత ,స్వరూప, స్వప్న, లాయక్, సాయిలు, భానుచందర్, తిరుపతిరెడ్డి, సాయన్న, కైసర్, లక్ష్మణ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
