అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తరవాత పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి పదవుల పందేరం లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
సంస్థాగత నియామకాలకు సిద్ధం అయినా ఆ ప్రతి సీనియర్ నేతలతో పాటు కొత్తవారికి పార్టీ వేదికల మీద పని చేసే అవకాశం ఇచ్చేలా కార్యాచరణ అమలు చేస్తుంది.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు పార్టీ పదవుల్లో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి ఎవరెవరు ఏ పదవులు ఆశిస్తుంది.
నేరుగా వారినే వాకబు చేసే పనిలో పడింది ఇందులో భాగంగా ఆయా జిల్లాకు ఇంచార్జ్ లను రంగంలోకి దించింది. నిజామాబాద్ జిల్లాకు పీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, పీసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్ రెడ్డిలను రంగంలోకి దించింది.
ఆయా పదవులకు అచ్చం ఉద్యోగ నియామకాల తరహాలోనే సీనియర్ నేతలను ఇంటర్వ్యూ చేశారు. వారు ఆశిస్తున్న పదవుల వివరాలు, గతంలో వారు నిర్వహించిన పదవులు, పార్టీ కోసం వారు చేసిన రాజకీయ, సామాజిక కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్, బోధన్ అర్బన్ నియోజకవర్గాలకు సంబంధించి సంస్థాగత పదవుల నిర్మాణ ప్రక్రియ ను పూర్తీ చేశారు పార్టీ జిల్లా కార్యవర్గానికి సంబంధించి 26 మంది.
ఆసక్తి ఉన్నారు నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలో మండల కార్యవర్గానికి 39 మంది.బోధన్ నియోజకవర్గంలో మండల కార్యవర్గానికి 17మంది. రెండు నియోజకవర్గాల్లోని 12 మండలాలతో పాటు జిల్లా కమిటీకి సంబంధించి మొత్తం 82 మందిని వీరు ఇంటర్వ్యూ చేశారు.
ఈనెల 13వ తేదీలోపు జిల్లాలో వివిధ పదవులకు పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షుల సమక్షంలో పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు సమక్షంలో ఆశావహుల జాబితా ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
