జిల్లా కాంగ్రెస్ పీఠం ఫై పీట ముడి పడింది. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్షళన పక్రియ ఫై ఇంకా మీన మేషాలు లెక్కిస్తుంది.
కానీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాపార్టీకి స్థానిక ఎన్నికల్లోపు కొత్త సారథి వచ్చే సంకేతాలు లేవు. పార్టీ ప్రభుత్వ పదవుల నియామకానికి ఈ మద్యే ముగ్గురు పరిశీలకులు గ్రూప్ వన్ లెవల్లో ఇంటర్వ్యూలు చేసారు.
వీరు పీసీసీ కి ఇచ్చిన నివేదికమేరకు దాదాపు అరడజన్ మంది డీసీసీ పీఠం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దిగ్గజ నేతలున్న జిల్లాలో డీసీసీ చీఫ్ నియామకం అంత సులువైన పనేమీ కాదు.
సమన్వయ లోపం డీసీసీ నియామకానికి ప్రతిబంధకంగా మారింది.పీసీసీ చీఫ్ సొంత జిల్లా అయినప్పటికీ డీసీసీ నియామకం క్లిష్టంగా మారడం పార్టీ వర్గాల్లో చర్చ నియాంశంగా మారింది.
ఈసారి కొత్త డీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ వర్గీయులకే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన పీసీసీ చీఫ్ గా నియామకం అయి దాదాపు యేడాది కావస్తుంది.
సుదర్శన్ రెడ్డి కొటారి లో ఉండే మానాల మోహన్ రెడ్డి ఉద్వాసన ఖాయమని మహేష్ నియామకం అయినా తోలి రోజుల్లోనే ప్రచారం మొదలైంది. దానికి తోడు మానాల కు కార్పొరేషన్ ఛైర్మెన్ పదవీ దక్కింది.
ఆయన కూడా యేడాది కాలంగా జోడు పదవుల మీద స్వారీ చేస్తున్నారు. కార్పొరేషన్ పదవి వచ్చాకా ఆయన ఎక్కువ కాలం హైదారాబాద్ కే పరిమితం అవుతున్నారు. దీనితో డీసీసీ వ్యవహారాల్లో మునుపటి లా క్రియాశీలంగా పనిచేయలేక పోతున్నారు.
ఆలా అని డీసీసీ పదవి నుంచి తనకు తానుగా వైదొలగడానికి ససేమిరా అంటున్నారు. పీసీసీ కొత్త నియంకం చేపట్టేదాకా డీసీసీ పీఠం వదులు కోవద్దని మానాల భావిస్తున్నారు.
కొత్త డీసీసీ సారథి ఎవరనే విషయంలో భిన్న వాదనలు తెరమీదికి వస్తున్నాయి. మహేష్ గౌడ్ ,సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంటి నేతలున్న జిల్లాలో డీసీసీ పీఠం ఎవరి విధేయులకు దక్కబోతున్నాడనేది పార్టీ వర్గాల్లోఉత్కంఠ గా మారింది.
పీసీసీ నియామకంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న మహేష్ గౌడ్ డీసీసీ పీఠం విషయంలోనూ అదే పాచిక లు వేయబోతున్నారు.
అనేక మంది సీనియర్ లు అందుబాటులో ఉన్నా సరే దశాబ్దాలుగా తన వెంటే నడిచిన నేతలు రామకృష్ణ ,మజీద్ , లతో పాటు రాంభూపాల్ లాంటి నేతలకు అత్యంత కీలక పదవులు కట్టబెట్టారు.
ఈ పదవులు నియామకం తో ఆయన పార్టీ లో తనదైన ముద్ర కోసం తపిస్తున్నారనేది స్పష్టం అయింది. డీసీసీ అధ్యక్షుడి నియామకం లోనూ మహేష్ తన వర్గీయుడికి అవకాశం దక్కేలా పావులు కదిపే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఆశలో షబ్బీర్ అలీ మంత్రి పదవి కోసం సుదర్శన్ రెడ్డి లు నిరీక్షిస్తున్నారు అందువల్ల డీసీసీ విషయంలో తాడోపేడో తేల్చుకునే దాక పట్టుబట్టే పరిస్థితి కనిపించడం లేదు.
