మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమే అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఆయన మంగళవారం మీడియా తో మాట్లాడారు కఅయినప్పటికీ ఏఐసీసీ క్రమశిక్షణ రాహిత్యంను సీరియస్ గా పరిగణించిందని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
పార్టీ క్రమశిక్షణే ముఖ్యమన్నారు . ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైనను ఎవరు దాటినా చర్యలు తప్పవు” అని ఆయన తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రితో తాను ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేసారు ఇద్దరం ప్రజాక్షేమం, కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అనవసర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని పీసీసీ చీఫ్ కోరారు.
పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గత వేదికలపై చర్చించాలి తప్ప, బహిరంగంగా క్రమశిక్షణ తప్పితే అధిష్ఠానం ఉపేకించదని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు
