ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ సంఘటన మంగళవారం . నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
హయత్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజీవ్ గృహకల్ప నుంచి వెళ్తున్న క్రమంలో . నాగోల్ వైపు నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను వనస్థలిపురం, సికింద్రాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
