HomeEditorial Specialఒక అభ్యర్థి..ఒకే నామినేషన్‌ ..... ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీకి స్థానాలకు పోటీ కి నోచాన్స్‌..........కుటుంబంలో...

ఒక అభ్యర్థి..ఒకే నామినేషన్‌ ….. ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీకి స్థానాలకు పోటీ కి నోచాన్స్‌……….కుటుంబంలో అందరివోట్లు ఒకే పోలింగ్‌బూత్‌లో ……స్థానిక ఎన్నికల్లోనూ నోటా!………ఎన్నికల కమిషన్ కసరత్తులు

బీసీ రిజర్వేషన్ ల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో స్థానిక ఎన్నికల విషయంలో సర్కార్ మల్ల గుల్లాలు పడుతుంది. మరో వైపు ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేస్తుంది.

ఎన్నికల నియమావళి నిబంధనలవిషయంలో కలెక్టర్ లకు దిశా నిర్దేశం చేస్తుంది.గతంలో ఒకకే అభ్యర్థి యంపిటీసీ జెడ్పిటిసి స్థానాలకు పోటీ చేసేది.ఈసారి అలాంటి అవకాశం లేకుండా కమిషన్ కట్టడి చేస్తుంది ఒక అభ్యర్థి ఒక్క పదవికే పోటీపడాలనే నిబంధనను తీసుకురానున్నట్టు సమాచారం.

ఒక అభ్యర్థి ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీచేసే అవకాశమూ ఈసారి ఉండదు.ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితా ఆధారంగా లోకల్ ఎన్నికలకు వెళ్లాలని కమిషన్ భావిస్తుంది గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను విభజించారు. చనిపోయినవారి పేర్లను తొలగించి, కొత్తగా ఓటర్లను చేర్చి నూతన జాబితాను రూపొందించారు.

అసెంబ్లీ లోకసభ తరహాలలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొత్తగా నోటాను తీసుకొస్తున్నారు. 2004 నుంచి పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మాత్రమే అమలులో ఉన్న నోటా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు. ఈ మేరకు బ్యాలెట్‌ పేపర్లలో నోటాను ముద్రించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి .

ఎంపీటీసీ పోలింగ్‌ కోసం గులాబీ, జడ్పీటీసీ ఎన్నిక కోసం తెలుపు రంగు బ్యాలెట్ల పేపర్లను సిద్ధం చేస్తున్నారు.

గతంలో మండలం యూనిట్‌ తీసుకున్నందున ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే కొన్నిసార్లు వారి ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండేవి. ఈసారి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నందున కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటు వేసేలా చర్యలు తీసుకోనున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments