ఒకే దిశలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటన నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.రూరల్ ఎస్ఐ అరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆర్మూర్ వైపు వెళ్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న లారీ రెండు బైపాస్ రోడ్డులోనీ డీఎస్ విగ్రహం వద్ద మలుపు తిప్పే సమయంలో ఢీ కొనడంతో బస్ కండక్టర్ కు గాయాలయ్యాయి.
హుటాహుటిన అతని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
