ముగ్గురు యువకులకు గాయాలుడిచ్ పల్లి జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముందున్న కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
