టిప్పర్ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్–గుండారం వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. గుండారం గ్రామానికి చెందిన అలండి అనిల్ (38) సోమవారం ద్విచక్రవాహనంపై గుండారం నుంచి ఖానాపూర్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ అనిల్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు.
టిప్పర్‌ను దక్కోటే వాగమరే నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
