నియోజకవర్గంలో అవసరమైన వారికి నిమ్స్ లో చికిత్స పొందేందుకు ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎల్వోసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన వారికి ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. నగరంలోని సారంగాపూర్ కు చెందిన కల్పన గుండె సంబంధిత వ్యాధితో బాదపడుతున్నారన్నారు.
దీంతో నిమ్స్ లో చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు. అలాగే హైదరాబాదులోని బీ బీ నగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక సేవలు అందుబాటు వచ్చాయన్నారు.
పేదలు దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్నవారు, అత్యవసర శస్త్రసికిత్సలు అవసరమైన వారు ఎయిమ్స్ కి వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో నిర్మించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు.
