HomeTelanganaNizamabadఅంతరిక్ష కార్యక్రమానికి శ్రీహిత ఎంపికకేజీఎఫ్‌ ట్రస్ట్‌ రూ.10 వేల ప్రోత్సాహకం

అంతరిక్ష కార్యక్రమానికి శ్రీహిత ఎంపికకేజీఎఫ్‌ ట్రస్ట్‌ రూ.10 వేల ప్రోత్సాహకం

జాతీయస్థాయి అంతరిక్ష కార్యక్రమానికి డిచ్‌పల్లి మండలం రాంపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి.శ్రీహిత ఎంపిక కావడం పట్ల కేజీఎఫ్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌, చైర్మన్‌ జేసీ మనోజ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని అభినందిస్తూ ట్రస్ట్‌ తరఫున రూ.10 వేల నగదు చెక్కును అందజేసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయస్థాయిలో ప్రతిభ చాటుకోవడం అభినందనీయమని మనోజ్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతోపాటు వారికి అవసరమైన అవకాశాలు కల్పించడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు. ఒక విద్యార్థిని ప్రోత్సహించడం ద్వారా మరెందరో విద్యార్థులకు స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు.

అంతరిక్ష విజ్ఞానం, ఖగోళశాస్త్రం, ఉపగ్రహ సాంకేతికత తదితర అంశాలపై అవగాహన కల్పించే జాతీయస్థాయి కార్యక్రమానికి శ్రీహిత ఎంపిక కావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

శ్రీహితను ప్రోత్సహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగా సావిత్రి, మార్గదర్శక ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌లను ట్రస్ట్‌ సభ్యులు అభినందించారు.

కార్యక్రమంలో కేజీఎఫ్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి నాగేందర్‌ పాల్గొని శ్రీహితను అభినందించారు. విద్య, ఆరోగ్యం, క్రీడలు తదితర రంగాల్లో యువతకు అవసరమైన సహాయాన్ని అందించడమే ట్రస్ట్‌ లక్ష్యమని మనోజ్‌కుమార్‌ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments