రెండు దఫాల సీట్ల కేటాయింపు పక్రియ పూర్తీ అయ్యాక ప్రభుత్వం జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది. దశాబ్దకాలంగా విద్యార్థి లోకం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ మంజూరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది .
తెలంగాణ యునివర్సిటీ ప్రాంగణం లోనే ఓ భవనంలో కొత్త కాలేజీ ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ భవనం లో కాలేజీ తరగతులు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ మంజూరి వచ్చిన నాడే రాజకీయ రగడ మొదలయ్యింది. కాలేజీ తెచ్చిన ఖ్యాతి కోసం నేతల వెంపర్లడుతున్నారు.
విజయోత్సవాల పేరుతొ ఆయా పార్టీలు రోజంతా హంగామా చేసాయి.అసలు కాలేజీ యూనివర్సిటి కి అనుబంధం! కానీ జేఎన్టీయూ నిర్వహణ లో ఉండే కాలేజీ కి మాత్రమే ఖ్యాతి వుంటుంది. మెరిట్ ఉన్న విద్యార్థులు జేఎన్టీయూ పరిధి లో ఉండే కాలేజీ లో చేరడానికి ఆసక్తి చూపుతారు. కానీ అదేదో పొడిచేశామనే స్థాయిలో ఆయా పార్టీల నేతలు బిల్డప్ ఇచ్చేస్తున్నారు.చివరికి పదేళ్లు అధికారం వెలగబెట్టిన బిఆర్ యస్ సైతం అదే బిల్డప్.
అసలు తెలంగాణ యునివర్సిటీ ప్రతిష్ట మంట గలిపిన ఘనత బిఆర్ యస్ సర్కార్ ది.కదా ! యునివర్సిటీ కి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడమనేది అత్యంత సులువైన పక్రియ నిజానికి యునివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజీ కోసం గతంలోనే బోధన సిబ్బంది నియామకం జరిగింది.
కానీ విసి లు ఎవరూ కాలేజీ కోసంకనీస ప్రయత్నాలు చేయలేక పోయారు.దీనితో ఆ సిబ్బంది ఇప్పుడు యంబిఏ తరగతులు చెప్తున్నారు.కానీ తెలంగాణ రాష్త్రం వచ్చాక జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వాలని డిమాండ్ మొదలయ్యింది.
అప్పటి ఎంపీ కవిత మంత్రులు ఎమ్మెల్యే లకు విద్యార్థి సంఘాలు నివేదించాయి.కనీసం యునివర్సిటీ కి అనుబంధంగా నైన కాలేజీ ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో అరడజన్ కాలేజీ లు మంజూరి అయ్యాయి.
అయినా జిల్లాకు చెందిన బిఆర్ యస్ పెద్దలకు మాత్రం సోయి రాలేదు.దాదాపు పదేళ్లు కాలయాపన చేశారు. కాలేజీ సంగతి దేవుడెరుగు ఉన్న యునివర్సిటీ కి దీనావస్థ కల్పించారు. అయినా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ కి ఖ్యాతి కోసం నిసిగ్గుగా వెంపర్లాడుతున్నారు.
కాలేజీ సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా జేఎన్టీయూ అనుబంధ కాలేజీ ప్రతిపాదన ను అటకెక్కించి యునివర్సిటీ విసి చొరవ చూపి తెచ్చిన కాలేజీ ఖ్యాతి తమదే అంటూ రంకెలేస్తున్నారు.
యునివర్సిటీ ఏర్పాటైన మొదట్లోనే అందుబాటు లోకి రావాల్సినకాలేజీ దాదాపు 13 ఏళ్ళ తరవాత వచ్చింది.అయినా ఎవరి కి వారే రోజంతా సంబరాలు చేసాయి. ఇక విద్యార్థి సంఘాలవైఖరి మరీ రోత పుట్టించింది.
ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి చందాలు వసూళ్లు మీద ఉన్న ద్యాస ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు మీద ఎక్కడిది. చివరికి అర్బన్ ఎమ్మెల్యే సైతం తాను అసెంబ్లీ లో గట్టిగా నిలదీయడం వల్లే కాలేజీ వచ్చిందంటూ ఢంకా బజాయించారు. ఇంతకీ ఈ సంబరాలతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ అటకెక్కినట్లే నా.!
