Tuesday, April 21, 2026
HomePOLITICAL NEWSArmoorకాంగ్రెస్ పాదయాత్రను విజయవంతం చేయండి - పొద్దుటూరి వినయ్ రెడ్డి

కాంగ్రెస్ పాదయాత్రను విజయవంతం చేయండి – పొద్దుటూరి వినయ్ రెడ్డి

: కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించేందుకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కోరారు.

ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు.

రెండవ తేదీన ఆలూర్ నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు కొనసాగే ఈ పాదయాత్రలో ఎఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ మంత్రి షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొంటారని వివరించారు.

అనంతరం ఆర్మూర్ లోనే బస చేసి మరునాడు మరిన్ని కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!