Tuesday, April 21, 2026
HomePOLITICAL NEWSUncategorizedముప్కాల్ లో ఉద్రిక్తత - సవాల్ విసురుకున్న బిజెపి - కాంగ్రెస్ నేతలు - మాజీ...

ముప్కాల్ లో ఉద్రిక్తత – సవాల్ విసురుకున్న బిజెపి – కాంగ్రెస్ నేతలు – మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు – బీజేవైఎం అధ్యక్షుడు సంతోష్ హౌస్ అరెస్ట్ – క్రమం తప్పిన బాల్కొండ రాజకీయం

ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇటీవల కాలంలో సంచలనంగా మారిన బాల్కొండ రాజకీయ ఇంకా రాజుకుంటూనే ఉంది.

మొన్న భీంగల్, నిన్న వేల్పూర్ లలో బి ఆర్ ఎస్ కాంగ్రెస్ నేతలు బహిరంగ ఘర్షణలకు దిగగా, నేడు ముప్కాల్ మండల కేంద్రంలో బిజెపి కాంగ్రెస్ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఫ్కాల్ మండల కేంద్రంలో స్థానిక నేతలు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకున్న ఘటన ఉధృతతకు దారితీసింది .

ముఫ్కాల్ మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ పై బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ అవినీతి ఆరోపణ చేయడంతో ఇద్దరు చర్చకు సిద్దమయ్యారు.

ముందుగా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఆధారాలతో సహా స్థానిక గ్రామ పంచాయతీ వద్ద చర్చకు రావడంతో పోలీసులు ముందస్తుగా పోలీసులు రంగ ప్రవేశం చేసి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కూడ చర్చకు ఆధారులతో గ్రామపంచాయతీ వద్దకు వెళుతుండగా పోలీసులు సంతోష్ ను గృహనిర్బంధం చేశారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు నాయకులకు మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇదిలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలతో సహా తీసుక రావాలని మాజీ సర్పంచ్ కొమ్మల శ్రీనివాస్ ఆరోపించారు.

మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షణాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకుడు సంతోష్ ఇటీవల పదేపదే తన పేరుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు చేస్తున్నాడనీ, ప్రతి విషయం గురించి తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని గ్రామపంచాయతీ వద్ద గురువారం ఉదయం 10 గంటలకు చర్చకు తాను సిద్ధమని నాయకుడు సంతోష్ సిద్ధమైతే చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

తాను ఇందిరమ్మ ఇళ్లలో చేసిన అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ ఉందని ఆరోపించడం సబబు కాదని హెచ్చరించాడు. రోజు సోషల్ మీడియాలో తనకు నచ్చిన విధంగా మాట్లాడo కాదని ప్రజల మధ్యలో నిజానిజాలు తేల్చుకోడానికి గురువారం రావలన్నాడు.

ఇలా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాల్సిన రాజకీయ పార్టీలు వీధులలో రణ రంగాన్ని సృష్టించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!