HomeTelanganaNizamabadశ్రీరామ సాగర్ ప్రాజెక్టు పోటెత్తిన వరద ....... మహారాష్ట్ర నుంచి పెరిగిన వరద

శ్రీరామ సాగర్ ప్రాజెక్టు పోటెత్తిన వరద ……. మహారాష్ట్ర నుంచి పెరిగిన వరద

గోదావరి ఎగువ మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరామసాగర్ ప్రాజెక్టు కు వరద నీరు పోటెత్తింది రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర బాబ్లీ,విష్ణుపురి, మాలేగావ్ ప్రాజెక్టులనుండి ఎస్సారెస్పీప్రాజెక్టులోకి 89466 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

◆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు 80.501 టీఎంసీలు ఉండగా శనివారం మధ్యాహ్నం వరకు 1082.30 అడుగులు 51.659 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఏ.ఈ.ఈ.రవి తెలిపారు.

ప్రధాన కాలువ కాకతీయ ద్వారా 4625 వేల క్యూసెక్కులు, మంచి నీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 541 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు.

గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1081.10 అడుగులు 48.071 టీఎంసీలుగా ఉందని 1 జూన్ నుండి ఇప్పటివరకు 46.930 టిఎంసీల నీరు వచ్చి చేరింది.1 జూన్ నుండి ఇప్పటివరకు 8.937 టిఎంసీ ల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు.

గోదావరి నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలిగోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments