యువ ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్షిప్ ఈ నెల 27 నుండి సెప్టెంబర్ 5 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి 8 టీమ్స్ గా విభజించినారు.
జిల్లా కి చెందిన కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ యువ తెలంగాణ ప్రో కబడ్డీ లో శాతవన సైనికులు జట్టు కు చీఫ్ కోచ్ గా నియామకం అయినారు.ప్రస్తుతం కోచ్ ప్రశాంత్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ లో కబడ్డీ కోచ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కబడ్డి సంఘం అధ్యక్షుడు అంద్యాల లింగయ్య కార్యదర్శి గంగాధర్ రెడ్డి కోశాధికారి సురేందర్ వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ రెడ్డి, బొబ్బిలి నరసయ్య రాజకుమార్, గంగారెడ్డి, రాజేందర్, శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి,హైదర్ ఆలీ,హరి చరణ్ అనురాధ, జ్యోతి సీనియర్ క్రీడాకారులు పలువురు అభినందించినారు.
