బిసి లకు విద్యా ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని
బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్ టి. చిరంజీవులు పేర్కొన్నారు.
సోమవారం బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో . చిరంజీవులు స్వగృహం హైదరాబాద్ లో కలిసి శాలువ పూల బొకే తో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ..బిసి లకు విద్యా ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలన్నారు.
బిసి లకు క్రీమిలేయర్ విధానాన్ని తొలగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి నాయకులు ఉట్నూర్ సుభాష్, పల్లికొండ అన్నయ్య, వేణుగోపాల్, పాక శంకర్, మేకల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
