మోపాల్ మండలంలోని కల్పోల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కారుపై దాడి చేసి కారు అద్దాలు ద్వాసం చేశారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కార్యదర్శి మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.
సోమవారం కల్పోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని వాగు పొంగి పోర్లడంతో పరిశీలించడానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు కారును ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పెట్టీ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టినట్లు తెలిపారు.
దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు
