ఇల్లు కూల్చేసిన ఘటన లో నిందితుల మీద అభియోగాలు రుజువు కావడంతో బిఆర్ యస్ నేత సహా ఆరుగురికి యస్సి ఎస్టీ కోర్టు జైలు శిక్ష విధిస్తు సోమవారం తీర్పు చెప్పింది.
మోర్తాడ్ మండలం రామన్నపేట్ గ్రామనికి చెందిన పోచయ్య ఇంటి వివాదం న్యాయస్థానం పరిధిలో ఉండగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ బాజిరెడ్డి రమాకాంత్ అనే వ్యక్తి ఇల్లు తనది అంటూ దౌర్జంగా 20 మంది గుర్తు తెలియని వ్యక్తులతో తన ఇంటిని జెసిబి తో 2015 జులై లో కూల్చివేశాడని బాధితుడు మోర్తాడ్ పోలీసు స్టేషన్ లో రోజు పిర్యాదు చేశారు
కేసు పూర్వాపరాలు పరిశీలించిన నిజామాబాద్ సెకండ్ అడిషనల్ జడ్జి T. శ్రీవాస్ దోషులుగా తేలిన బాజిరెడ్డి రమాకాంత్ తో పాటు 5 గిరికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు .అలాగే మొదటి ముగ్గరు నిందితులకు రూ 5 వేలు మరో ముగ్గురికి రూ 3 వేలు జరిమానా విధించారు
