HomeCRIMEఇందూర్ డాక్టర్లు సీఎంసీ ని దోచేశారు ... కొత్త డైరెక్టర్లతో ఆసుపత్రి నిర్వహణ...

ఇందూర్ డాక్టర్లు సీఎంసీ ని దోచేశారు … కొత్త డైరెక్టర్లతో ఆసుపత్రి నిర్వహణ…

లెక్కలు చెపితే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధం…రూ.1.80 కోట్ల సామాగ్రి సీఎంసికి రాలేదు…వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…సీఎంసి మెడికల్ కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ లింగం

నిజామాబాద్ నగరానికి చెందిన డాక్టర్లు అజ్జ శ్రీనివాస్ మంత్రి సుమంత్ లు యాజమాన్యం ను నమ్మించి కాలేజీ ని నిలువునా దోచేశారని ఆ కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ లింగం ధ్వజమెత్తారు సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎంసి మెడికల్ కాలేజ్ లో నాలుగు నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలు, నియామకాలు తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు. .

డిచ్పల్లిలోని సీఎంసి మెడికల్ కాలేజ్ నువివిధ దశల్లో రూ. 200 కోట్లతో మళ్ళీ ప్రారంభించి కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది. ఐఎంఎస్ఆర్ ప్రయత్నాలతో, 500 పడకల సీఎంసి ఆసుపత్రిని మే 25న రాష్ట్ర అధికారుల ఆమోదంతో తిరిగి ప్రారంభించామన్నారు అజ్జ మంత్రి లే దోచేశారు

నగరానికి చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ అజ్జా శ్రీనివాస్ తనకు . 200 మంది వైద్యుల నెట్ వర్క్ ఉందని చెప్పి 30 మందిని నియమించారు.

ఎంసిఐ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నియమిచాలని సూచించాం. చెప్పినా పట్టించుకోలేదన్నారు డాక్టర్ అజ్జా శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో పని చేస్తున్న డాక్టర్ మంత్రి సుమంత్ లు కలిసి కథ నడిపారన్నారు పలువురు వైద్యులు తాత్కాలిక నియామకాలు చేశారు .

వీరు నామమాత్రంగా ఆసుపత్రికి రావడం వెళ్లడం తప్ప పనిలో కనీస బాధ్యతగా వ్యవహరించడం లేదు. విధులకు రాకున్నా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్నారు. దింతో రోజుకు 10 మంది రోగులు ఆసుపత్రికి రావడం లేదు.

డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ మంత్రి సుమంత్, డాక్టర్ ఎల్.పాండు, లు ఇష్టారాజ్యాంగ చేసారని . 30 మంది వైద్యులు, 20 మంది నర్సులు, 15 మంది పారా-మెడికల్ సిబ్బంది, 25 మంది అడ్మిన్ సిబ్బంది మరియు 35 మంది దినసరి వేతన కార్మికులు ఉన్నారు.

వీరందరినీ సిఎంసి సంస్థల చైర్మన్ మరియు నిర్వహణ కమిటీ అనుమతి లేకుండా నియమించారు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మరో అడుగు ముందుకేసి మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ఫార్మసీ దుకాణాల నిర్వహణ, నిర్మాణ పనులు, వైద్య పరికరాల కొనుగోలు క్యాంపస్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కన్నెశారని ఆయన ఆరోపించారు.

మూడు చెక్కులు రూ. 5 కోట్లకు ఇచ్చారు. దీని కోసం డైరెక్టర్ పోస్టు ఇచ్చాము. కానీ చెక్కులు ఇచ్చారు. డ్రా చేయడానికి వెళితే చెక్కుల డ్రా కు అనుమతి ఇవ్వొద్దని లేటర్ ఇచ్చాడన్నారు .

అజ్జ కొనుగోళ్ళ పేరుతో.దగా గోపతి రవి కుమార్, బానోత్ ప్రీతి యాజమాన్యంలోని ములుగులోని మెస్సర్స్ బాలాజీ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎ. శంకర చారి మధ్యవర్తిగా రూ.92 లక్షల విలువైన పాత వైద్య పరికరాలను కొనుగోలు చేసారు.

ఈ డబ్బు చెక్కుల రూపంలో చెల్లించాం. వీటిలో రూ.72 లక్షల సామాగ్రి ఇంక అందివ్వలేదు. ఏప్రిల్ 8, 2025లో రూ.88,84,790 విలువైన పరికరాలను కొనుగోలు చేశారు. సీఎంసి నుంచి తీసుకున్న వేకెంట్ చెక్కులను ఛైర్మెన్ అనుమతి లేకుండాఅక్కడ అందజేశారు.

దీనిపై ఆ కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆ తరువాతనే అజ్జ శ్రీనివాస్ ను జూన్ 10న తొలగించారు. హైపవర్ కమిటీ చివరకు అజ్జ సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. హెచ్పీఎస్, ఎన్ఎంసీ లు అజ్జ శ్రీనివాస్ దరఖాస్తును తిరస్కరించాయి.

ప్రభుత్వ ఉద్యోగి మోసం…ప్రభుత్వ ఉద్యోగి అయిన మంత్రి సుమంత్ నిజామాబాద్ లోని మెడికల్ కాలేజీలో చేరినట్లు ఆయన చెప్పుకున్నారు. అయితే ఆయన వాదనకు ఆధారాలు లేకపోయినా డాక్టర్ అజ్జ శ్రీనివాస్ గట్టిగా సిఫార్సు చేశారు.

ఆ విధంగా ఆయనను సిఎంసి సంస్థలలో ఫ్యాకల్టీ సభ్యుడిగా నియమించారు. ప్రభుత్వ సేవ నుండి సరైన రిలీవ్ ఆర్డర్ ను సమర్పించడంలో, అతని అర్హతలు, అనుభవానికి సంబంధించిన అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించలేదు. నోటీసులు ఇచ్చిన స్పందించలేదు.

ఇలా విఫలమైనందున జూన్ 10న తొలగించాం. వాస్తవానికి ఇతనిపై ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఇతనికి కూడా సీఎంసి మెడికల్ కాలేజ్ కు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు. చావనైనా చస్తా గానీ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తాం.

ఎవరి వద్ద నుంచి కూడా రూపాయి డబ్బులు వసూలు చేయలేదు. అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాను. నేను ఎక్కడికి పారిపోలేదు. చైర్మన్ అప్రూవల్ లేకుండా 120 మంది నియామకం చేసారు.

అర్హత లేని వారిని తొలగించాం. పూర్తి వివరాలతో వాస్తవాలను ప్రచురించి నిజామాబాద్ గ్రామీణ ప్రజలకు న్యాయం చేయండి అని సీఎంసి మెడికల్ కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments