కందకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్..గోదావరి నది వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా సోమవారం బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జి ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కందకుర్తి లో గల ఎగువన నిజాంసాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి వరకు దాదాపు వచ్చింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు.
అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్ఐ కె. చంద్ర మోహన్ , మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్ ఏఈఓ శ్రీ గోపి కృష్ణ తదితరులు ఉన్నారు.
